LIVE : లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 11:03 AM IST

Updated : Feb 5, 2024, 6:53 PM IST

thumbnail

Lok Sabha Session Live : లోక్‌సభ సభ్యులకు బీజేపీ 3 లైన్‌ విప్ జారీ చేసింది.  ఇవాళ సమావేశాలకు అందరు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.  ఈ నేపథ్యంలో ఎంపీలు అందరు లోక్​సబ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంటులో శుక్రవారం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగింది. జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్​లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఝార్ఖండ్​ రాజకీయాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మరోవైపు, ఉభయసభలు ఫిబ్రవరి 5కు వాయిదా పడ్డాయి. లోక్​సభ ఫిబ్రవరి 5కు వాయిదా పడింది. శని, ఆదివారాలు సమావేశాలకు విరామం ఉంటుంది. సోమవారం (ఇవాళ) ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది. 

Last Updated : Feb 5, 2024, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.