LIVE : లోక్​సభ సమావేశాలు - Lok Sabha Budget Session LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 11:02 AM IST

Updated : Jul 31, 2024, 3:48 PM IST

thumbnail
Lok Sabha Budget Session LIVE: లోక్​సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్నటి సభలో బడ్జెట్​పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.  రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయమై కేంద్ర ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. బడ్జెట్‌ ప్రసంగంలో పేరు రానంత మాత్రాన ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించనట్లేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల హయాంలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లలోనూ 17 రాష్ట్రాల పేర్లు రాలేదని వెల్లడించారు. అంటే ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిధుల మంజూరును అడ్డుకున్నాయని భావించాలా అని నిలదీశారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. తిరిగి ఇవాళ మళ్లీ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 31, 2024, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.