LIVE : కోస్గి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - CM revanth in Kosgi Public Meeting
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-02-2024/640-480-20805126-thumbnail-16x9-cm-meeting.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 21, 2024, 5:20 PM IST
|Updated : Feb 21, 2024, 7:48 PM IST
CM Revanth Reddy in Kosgi Public Meeting LIVE : సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు. తొలిసారి అక్కడకు వెళ్లిన ఆయన, నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, వసతి భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, సీహెచ్సీని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ సహా సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కోస్గిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. లైవ్లో చూద్దాం