LIVE : ఖమ్మంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచారంలో కేటీఆర్ - KTR Meeting With Graduates Live - KTR MEETING WITH GRADUATES LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 6:28 PM IST

Updated : May 20, 2024, 6:45 PM IST

KTR Meeting With Graduate in Khammam Live : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉపఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎస్బీఐటీ కళాశాలలో జరుగుతున్న పట్టభద్రుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్‌, ఒక్కరికైనా పింఛన్‌ పెరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో 3 వైద్య కళాశాలలే ఏర్పాటయ్యాయని చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆరఎస్‌ పాలనలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని తెలుపుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మోసపూరితమైన హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీజేపీ పార్టీపై పలు విమర్శలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆలోచించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. 
Last Updated : May 20, 2024, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.