LIVE : సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ - కేటీఆర్ లైవ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2024/640-480-20610481-thumbnail-16x9-pm.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 28, 2024, 1:32 PM IST
|Updated : Jan 28, 2024, 2:22 PM IST
KTR Live : రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు.
కరెంటు బిల్లు సోనియాగాంధీ కట్టారా, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేంటి అని ప్రశ్నించారు. దేశ ప్రధాని ప్రియమైనవారు కాదని పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అదానీని తిట్టారని, మోదీ మనిషి అన్నారని, కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.