LIVE : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం - KISHANREDDY PRESSMEET - KISHANREDDY PRESSMEET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/640-480-21145903-thumbnail-16x9-kissan.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 4, 2024, 4:31 PM IST
|Updated : Apr 4, 2024, 5:02 PM IST
KishanReddy Live : తెలంగాణలో అధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇస్తున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన అంశం. ఇది ఆశామాషీ కేసు కాదు కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తి స్వేచ్ఛను హరించేశారని ధ్వజమెత్తారు.2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. అందుకే మరోసారి బీజేపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని పునరుద్హాటించారు. తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో వరుసగా పర్యటించడంతో కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Last Updated : Apr 4, 2024, 5:02 PM IST