రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు : కిషన్‌రెడ్డి - Kishan Reddy Comments on Congress - KISHAN REDDY COMMENTS ON CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : Mar 24, 2024, 5:20 PM IST
Kishan Reddy Comments on Congress : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. అమలు కానీ హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాహుల్ గాంధీ మాత్రం ఈ జన్మలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.
Kishan Reddy meeting with BJP Leaders : భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి అండగా ఉండటానికి తెలంగాణ మహిళలు సిద్ధంగా ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరం చొప్పున రూ.20 వేల సబ్సిడీ బీజేపీ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్‌తో పాటు పార్టీ లోక్‌సభ అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం ఎన్నికల ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన కేంద్రమంత్రి, ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని నేతలకు పిలుపునిచ్చారు.