LIVE : ఖైరతాబాద్ 'సప్తముఖ మహాశక్తి గణపతి' దర్శనానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh Darshan Live

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 11:57 AM IST

Updated : Sep 8, 2024, 2:04 PM IST

thumbnail
Khairatabad Ganesh Darshan Live : శనివారం నుంచి గణేశుని నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలో ఖైరతాబాద్​లో 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. తొలి పూజను సీఎం రేవంత్​ రెడ్డి చేశారు. ఆరోజు సాయంత్రం గవర్నర్​ కూడా ఖైరతాబాద్​ గణపతిని దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ప్రముఖులు మహాగణపతిని దర్శించుకున్నారు.సీఎం రేవంత్​ రెడ్డి తొలి పూజ అయిన తర్వాత ఖైరతాబాద్​ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ట్రాఫిక్​కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచించారు. నిత్యం వేలాది మంది గణపయ్యను చూడడానికి తరలి వస్తుంటారనే సమాచారంతో భద్రతను పూర్తిస్థాయిలో పెంచారు. ఖైరతాబాద్​లో వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు కావడంతో 70 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేశారు. నేడు రెండో రోజు కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉంది.
Last Updated : Sep 8, 2024, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.