ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమం : కల్వకుంట్ల సంజయ్​ - Good Morning Programme In Jagtial

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 12:51 PM IST

Kalvakuntla Sanjay In Jagtial : గ్రామాల్లోని వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచి, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్.కల్వకుంట్ల సంజయ్ నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా నేడు మెట్​పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో పర్యటించారు. వీధులన్నీ తిరుగుతూ ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో యువకులతో కలిసి వాలీబాల్ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. గ్రామస్థులతో కలిసి ఆయన చెత్తాచెదారం ఎత్తి రోడ్లను శుభ్రం చేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

Good Morning Programme In Jagtial : పారిశుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకోగలుగుతామని, అందుకే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.