కాళేశ్వరంపై విచారణ జరపాలని కోరుతూ- సీబీఐకీ కేఏ పాల్ ఫిర్యాదు - ka paul complaint on kaleshwaram - KA PAUL COMPLAINT ON KALESHWARAM
🎬 Watch Now: Feature Video


Published : Apr 15, 2024, 8:01 PM IST
KA Paul Complaints to CBI : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో కోఠిలోని సీబీఐకి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50వేల కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించినట్లు తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో కాగ్ నివేదిక ఉన్నప్పటికీ, సీబీఐ విచారణకు అదేశించలేదన్నారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడెందుకు స్పందించడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి లేఖ రాయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు తాను పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని పాల్ తెలిపారు.