thumbnail

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 11:31 AM IST

ETV Bharat / Videos

బైక్​తో 691 ట్యూబ్​లైట్లను పగలగొట్టిన ఆర్మీ జవాన్​- ప్రపంచ రికార్డ్​

Jawan Breaks Tubelights With Bike : ద్విచక్రవాహనంతో 691 ట్యూబ్​లైట్లను పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు​ ఆర్మీ జవాన్ దుర్గేశ్ కుమార్. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్ కోబ్రా మైదాన్​లో జరిగిన ఈవెంట్​లో ఈ ఘనత సాధించారు. ఆర్మీకి చెందిన డేర్​డెవిల్ టీమ్ సభ్యుడిగా హవల్దార్ దుర్గేశ్ కుమార్​ 2004 నుంచి కొనసాగుతున్నారు. ఇప్పటికే అనేక ప్రపంచ రికార్డులు సృష్టించే ఈవెంట్లలో పాల్గొన్నారు.

అయితే దుర్గేశ్ కుమార్​ తరచూ ట్యూబ్ లైట్లు పగలగొట్టే ఫీట్ చేసేవారు. దాని ప్రపంచ రికార్డుగా మలచడానికి బైక్​తో ఏకంగా 691 ట్యూబ్ లైట్లను బద్దలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. డేర్‌డెవిల్ జట్టు ఇప్పటి వరకు 32 ప్రపంచ రికార్డులను సాధించింది. విన్యాసాలు చేసేందుకు డేర్​డెవిల్​ టీమ్ రోజూ ప్రాక్టీస్ చేస్తోంది. చాలా క్రమశిక్షణతో సాధన చేస్తుంటోంది.

డేర్​డెవిల్​ టీమ్​లో మరో సభ్యుడు ధర్మేంద్ర సింగ్ ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. 12 అడుగుల ఎత్తున్న సీడీని మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని 12 గంటల పాటు మైదానంలో డ్రైవ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు అదే జట్టుకు చెందిన ఇంకో సభ్యుడి పేరిట ఉంది. ఇప్పుడు ఈ రికార్డును ధర్మేంద్ర సింగ్ బద్దలుకొట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.