'జూన్​ తొలి వారంలో ప్రవేశించి, రెండో వారంలోపు రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాల విస్తరణ' - IMD Officer On Weather Report - IMD OFFICER ON WEATHER REPORT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 7:53 PM IST

IMD Officer Sravani Interview With ETV Bharat : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా అధికంగా వర్షాలు కురవడంతో పాటు రుతుపవనాలకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఏర్పడటం వల్ల ఒక్క రోజు ముందుగానే నైరుతి ఆగమనం జరిగినట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. తెలంగాణలోకి జూన్‌ ఐదారు తేదీల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, 11వ తేదీలోపు రాష్ట్రమంతా విస్తారిస్తాయని చెప్పారు.

Weather Report in Telangana : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ఆగమనం సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటికీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. రాగల 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.