తెలుగులోకి హిందీ సూపర్ హిట్ సిరీస్- హైదరాబాద్లో సందడి చేసిన '11 :11 టీమ్' - Gyaarah Gyaarah Web Series - GYAARAH GYAARAH WEB SERIES
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2024, 1:23 PM IST
Gyarah Gyarah Web Series : వేర్వేరు కాలాల్లో ఉన్న ఓ ఇద్దరు పోలీసు అధికారులు వారి వాకీటాకీల ద్వారా సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఓ ఆసక్తికరమైన థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'గ్యారా గ్యారా'. ఉమేశ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్లో క్రితిక కామ్రా, ధైర్య కార్వా, రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే తాజాగా ఈ సిరీస్ నటులు క్రితిక, ధైర్య హైదరాబాద్కు వచ్చారు. తమ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి అని, ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహార రుచులు తమకెంతగానో నచ్చాయన్న క్రితిక, ధైర్యవ్లు, 'గ్యారా గ్యారా' వెబ్ సిరీస్లో నటించిన అనుభవాలను పంచుకున్నారు.
సామాన్య ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే పోలీసు పాత్రల్లో తమను తాము చూసుకోవడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే తెలుగు, తమిళంలోనూ అందుబాటులోకి రానుందని చెప్పారు. అలాగే ఈ సిరీస్కు సీజన్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు.