వరుసగా మూడోసారి వన దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ తమిళిసై - మేడారం జాతర 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 23, 2024, 2:17 PM IST
Governor Tamilisai Visits Medaram Sammakka Saralamma Temple : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి గవర్నర్ మేడారం చేరుకున్నారు. అనంతరం వనదేవతల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా గవర్నర్ చెల్లించుకున్నారు. మేడారానికి తాను వరుసగా మూడోసారి రావడం చాలా ఆనందంగా ఉందని గవర్నర్ తెలిపారు.
Medaram Jatara 2024 : మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను మెచ్చుకున్నారు. భారతదేశ ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని సమ్మక్క-సారలమ్మలను మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ మంత్రి అర్జున్ ముండా సమ్మక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రాంతాలను కలియతిరిగిన గవర్నర్, కేంద్రమంత్రి అర్జున్‌ముండా, రాష్ట్ర మంత్రి సీతక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.