పట్టాలు తప్పిన గూడ్స్ రైలు- ఐరన్ లోడ్‌తో వెళ్తుండగా 10 బోగీలు బోల్తా - పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
🎬 Watch Now: Feature Video
Published : Feb 17, 2024, 4:26 PM IST
Goods Train Derails In Delhi : దిల్లీలోని సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 10 బోగీలు బోల్తా పడ్డాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో గూడ్స్ రైలు ఐరన్ షీట్ రోల్స్‌తో వెళ్తున్నట్లుగా వారు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
దిల్లీలో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గరైంది. జాఖీరా ఫ్లై ఓవర్ దాటుతుండగా రొహల్లా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న అధికారులు హూటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రైల్లో ఐరన్ షీట్ రోల్స్ ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.