నెయ్యి లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం- సంచుల్లో ప్యాకెట్లు సర్దేసిన వాహనదారులు - నెయ్యిని ఎత్తుకెళ్లిన వాహనదారులు
🎬 Watch Now: Feature Video


Published : Feb 20, 2024, 12:50 PM IST
Ghee Packets Loot In Jhansi : ప్రమాదానికి గురైన లారీ నుంచి నెయ్యి ప్యాకెట్లు ఎత్తుకెళ్లిపోయారు వాహనదారులు. ప్యాకెట్లను సంచుల్లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది.
ఇదీ జరిగింది
ఝాన్సీలోని ఓ ఫైనాన్స్ కంపెనీ ట్రక్కులను ఆపి తనిఖీ చేస్తోంది. అందులో భాగంగా నెయ్యి లోడ్‌తో దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న లారీని ఆపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని ఓ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టిందని డ్రైవర్ రాహుల్ తెలిపాడు. దీంతో కంటైనర్‌లో ఉన్న నెయ్యి ప్యాకెట్లు కిందపడ్డాయి. అందులో కొన్ని పగిలిపోయాయి. ఇది గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు నెయ్యి ప్యాకెట్లను చోరీ చేశారు. ప్లాస్టిక్, గోనె సంచుల్లో నెయ్యి ప్యాకెట్లను వేసుకొని ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నెయ్యి ప్యాకెట్లను తీసుకెళ్తున్న కొంత మందిని అడ్డుకున్నారు.