గంగాజలం కోసం మెస్రం వంశస్థుల పయనం - త్వరలో నాగోబా జాతర ప్రారంభం - Ganga Water For Nagoba Maha Puja
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 10:18 AM IST
Ganga Water For Nagoba Maha Puja In Adilabad : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజల సందర్భంగా స్వామి అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం మెస్రం వంశస్థులు కాలినడకన బయల్దేరారు. ఆదివారం రోజున ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని మురాడి ఆలయం వద్ద ప్రత్యేకంగా మెస్రం వంశం పటేల్ వెంకట్‌రావు అధ్యక్షతన సమావేశమయ్యారు.
Nagoba Maha Puja In Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మెస్రం వంశస్థులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యారు. నాగోబా పూజలకు అవసరమయ్యే గంగాజలం కోసం కలశాన్ని గర్భగుడి నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. 158 మంది వంశస్థులు పాదయాత్రగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మెస్రం చిన్ను, పూజారులు కోసు, కోసేరావు, హన్మంత్‌రావు, ప్రధాన్ దాదేరావు, కోత్వాల్ తిరుపతి, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు. కేస్లాపూర్ నుంచి జన్నారం కలమడుగు వరకు వెళ్లిరావడానికి 260 కిలోమీటర్లు ప్రయాణిస్తారు.