LIVE : హనుమకొండలో కేసీఆర్ బస్సు యాత్ర - KCR BUS YATRA IN HANAMAKONDA LIVE - KCR BUS YATRA IN HANAMAKONDA LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 28, 2024, 8:37 PM IST
|Updated : Apr 28, 2024, 9:00 PM IST
Former CM KCR Lok Sabha Election Campaign in Hanamakonda Live : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హనమకొండలో రోడ్ షోలో పాల్గొన్నారు. సాయంత్రం పూట హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్ జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మీదగా హనమకొండ చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మారపెల్లి సుధీర్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ అంబేడ్కర్ కూడలి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జాయిన్ అయి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యపై మండిపడ్డారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై విమర్శలు చేస్తూ, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
Last Updated : Apr 28, 2024, 9:00 PM IST