ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగు - జలదిగ్బంధంలో ఇళ్లు - FLOOD VICTIMS PROBLEMS - FLOOD VICTIMS PROBLEMS
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2024, 7:31 PM IST
Flood Victims Problems Khammam District : ఖమ్మం జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ వరద ప్రభావం మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కారేపల్లి మండలం పేరేపల్లి వద్ద బుగ్గవాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారిపై వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
క్రమంగా వరద ఉద్ధృతి పెరిగి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎస్సై రాజారామ్ నేతృత్వంలో స్థానిక పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్థానికులకు అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వరద బాధితుల సామాన్లను కూడా వారితో తీసుకెళ్లే విధంగా చూశారు. ట్రాక్టర్ సహాయంతో వారిని క్షేమంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వరదనీరు అంతకంతకు పెరుగుతోందని, ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు బాధితులను తరలించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ రాజారామ్ తెలిపారు.