రైల్లో చెలరేగిన మంటలు - రెండు బోగీలు దగ్దం - FIRE ACCIDENT AT SECUNDERABAD - FIRE ACCIDENT AT SECUNDERABAD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2024/640-480-21752620-thumbnail-16x9-fire.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 20, 2024, 1:51 PM IST
Fire Accident At Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్‌ల్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్షణాల్లోనే మరో కోచ్‌కు మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. తొలుత ప్యాంటికార్ కోచ్‌లో మంటలు చెలరేగి, మరో రెండు బోగీలకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న 3 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. రైల్వే రక్షక దళం ( జీఆర్పీ ) పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మంటలు చెలరేగడంతో, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతంలో కాసేపటివరకూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.