ప్రజాభవన్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం - తప్పిన పెను ప్రమాదం - Fire Accident at praja bhavan - FIRE ACCIDENT AT PRAJA BHAVAN
🎬 Watch Now: Feature Video
Published : Aug 2, 2024, 4:19 PM IST
Fire Accident at Petrol Station Near Praja Bhavan : నిరంతరం ఆ ప్రాంతం ప్రజాప్రతినిధులతో, జనాలతో రద్దీగా ఉంటుంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినసరే శాంతిభద్రతల సమస్య వస్తుంది. అదే ప్రజాభవన్ ఉన్న ప్రాంతం. అయితే ఆ ప్రజాభవన్‌కు కూతవేటి దూరంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బంకులోని భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసిన ట్యాంక్ మూతను తీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన బంక్ సిబ్బంది వాహనాదారులను అక్కడి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది విద్యుత్‌ను నిలుపుదల చేశారు. ఆ తర్వాత ఫైర్ ఫైటర్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు బంక్ యాజమాన్యం అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.