నీట్ పరీక్షలో అవకతవకలపై ఈడీ ఎందుకు స్పందించడం లేదు : మాజీ ఎంపీ వినోద్ కుమార్ - EX MP Vinodh Kumar on Neet Exam - EX MP VINODH KUMAR ON NEET EXAM
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 2:20 PM IST
EX MP Vinodh Kumar or NEET Exam 2024 Mistakes : నీట్ వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా తేల్చాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై నిపుణులతో కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నా ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రం అమ్ముకున్నారని కేంద్రమే చెబుతోందని, చాలా రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిందన్నారు. విద్యార్దులు, తల్లిదండ్రుల్లో ఆవేదన, ఆందోళన నెలకొన్న పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Vinodh Kumar or NEET Exam : ఎంబీబీఎస్, పీజీ సీట్లలో ఆలిండియా కోటా కింద రాష్ట్రానికి ఇతర విద్యార్థులు వస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. కానీ, మన విద్యార్ధులు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఆలిండియా కోటాకు తెలంగాణ ఎక్కువ సీట్లు ఇస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీట్లు తక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా నాన్ లోకల్ అవుతామని రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లట్లేదని వివరించారు.