LIVE : తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియా సమావేశం - ex minister Harishrao press meet - EX MINISTER HARISHRAO PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 12:17 PM IST
|Updated : Jul 2, 2024, 12:36 PM IST
Ex Minister Harish Rao Press Meet at Telangana Bhavan : గ్రామాలను తమ ప్రభుత్వ హయాంలో చాలా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను కేసీఆర్ నిలిపారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు చూస్తోందని అన్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు తగువని పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకోవాలని అన్నారు.
Last Updated : Jul 2, 2024, 12:36 PM IST