YUVA : మీ ఇంట్లో టీవీ, ఫ్యాన్​ వంటివి ఎంత కరెంటు​ లాగుతున్నాయో తెలుసా? - ఈ పరికరంతో ఇట్టే తెలుసుకోవచ్చు - ETV Bharat interview with S Reddy

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

thumbnail
మీ ఇంట్లో టీవీ, ఫ్యాన్​ వంటివి ఎంత కరెంటు​ లాగుతున్నాయో తెలుసా? - ఈ పరికరంతో ఇట్టే తెలుసుకోవచ్చు (ETV Bharat)

Using this Device can Save Electricity Bill : నెల అయితే వచ్చే కరెంట్​ బిల్లు చూసి అమ్మో ఇంత వచ్చిందా మేము సరిగా వాడనేలేదే ఇది ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటాం. అయితే అది నిజమే అంటుంది హైదరాబాద్​కు చెందిన భారత్​ స్మార్ట్​ సర్వీస్​ అంకుర సంస్థ. కానీ, మీరనుకుంటున్నట్లు తేడా మీటర్​లో కాదు మనం ఉపయోగించే ఎలక్ట్రిక్​ పరికరాల్లో ఉందంటున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు వినూత్న పరికరాలు తయారు చేశారు. మరి వాటి ప్రత్యేకతలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలో వివరిస్తున్నారు.

ఒక్క యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో ఎంతో కాలుష్యం వెలువడుతోంది. సోలార్, పవన విద్యుత్‌ మినహా మిగతా విధానాల్లో విద్యుత్ ఉత్పత్తి వల్ల కర్భన ఉద్ఘారాలు భారీగా వెలువడుతాయి. దీనివల్ల పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతోంది. ఫలితంగా ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయి. విద్యుత్ వినియోగంలో మాత్రం ఒక్క యూనిట్‌యే కదా ఏమవుతుందిలే అనే నిర్లిప్తత ఉంటుంది. కానీ ఓ యువకుడు మాత్రం ఒక్క యూనిట్‌ విద్యుత్‌ను వేస్ట్‌ చేసినా భవిష్యత్ తరాలకు మోసం చేసిన వాళ్లమవుతామని అంటున్నారు. అతనే భారత్ స్మార్ట్‌ సర్వీసెస్ సీఈఓ సికందర్ రెడ్డి. తాను ఉపయోగించిన పరికరాల ద్వారా ఒక్కో యూనిట్ విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వాడుకోవచ్చని చెబుతున్న సికందర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.