ఊరేగింపులో ఏనుగుల బీభత్సం- భక్తుల తోపులాట- అనేక మందికి గాయాలు! - Elephant Fight In Kerala Video - ELEPHANT FIGHT IN KERALA VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Mar 23, 2024, 4:02 PM IST
Elephant Fight In Kerala Video : కేరళలో దేవుని ఊరేగింపునకు తెచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఒకదానిపై ఒకటి దాడికి దిగాయి. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఏనుగల కొట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
త్రిస్సూర్ జిల్లాలో అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్ ఆచార దేవుని ఊరేగింపు నిర్వహించారు. ఇందుకోసం రెండు ఏనుగులను నిర్వాహకులు తెచ్చారు. ఊరేంగింపులో వాటిలో ఒకటి అకస్మాత్తుగా మావటిని కిందపడేసి తొండంతో తోటి ఏనుగుపైకి దాడికి దిగింది. ఆ రెండు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. చాలా సమయం భీకరంగా పోరాడిన రెండు గజాల్లో ఒకటి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. భక్తులు భయాందోళనకు గురికావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం రెండు ఏనుగులకు సంబంధించిన పోరాట దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.