రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు - డీకే అరుణ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video


Published : Mar 27, 2024, 9:53 PM IST
DK Aruna Comments on CM Revanth : తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదని, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధి జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయాన్ని డీకే అరుణ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు.
మోదీ పథకాలు దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో అందుతున్నాయని, ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికార గర్వంతో అహకారపూరితంగా వ్యవహరించినందుకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని, రేవంత్‌రెడ్డికి సైతం ఇటువంటి పరిస్థితి తప్పదని ఆమె అన్నారు. తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలో మోదీ గెలుపును అడ్డుకోలేరన్నారు.