షుగర్ ఫ్యాక్టరీల పునః ప్రారంభంపై కాంగ్రెస్ మాటమారుస్తోంది : ధర్మపురి అర్వింద్ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video


Published : May 3, 2024, 4:25 PM IST
Dharmapuri Arvind fires on Congress : మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలపై కాంగ్రెస్ నేతలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఫ్యాక్టరీలు తెరిపించాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ మ్యానిఫెస్టో కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని పేర్కొన్నారు. చెరకు రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామా ఆడుతోందని దుయ్యబట్టారు.
షుగర్ ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో బ్యాంక్ బకాయిలతో పాటు, ప్రైవేటు భాగస్వామికి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలతో ఎస్సీ ఎస్టీ బీసీలు బలవుతున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోలో గల్ఫ్ బోర్డ్ ప్రస్తావనే లేదన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తానని రేవంత్ ప్రమాణాలు చేస్తుంటే, పార్టీ మాత్రం కమిషన్ వేస్తామని అంటోందని అన్నారు.