ధరణి ద్వారా మళ్లీ భూస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు : కోదండరెడ్డి - Kodanda Reddy on BRS - KODANDA REDDY ON BRS
🎬 Watch Now: Feature Video
Published : Aug 8, 2024, 7:14 PM IST
Dharani Committee Convenor Kodanda Reddy on BRS : గత ప్రభుత్వం ధరణి ద్వారా మళ్లీ భూస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఫతేమైదాన్ క్లబ్‌లో కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, పర్యావరణ వేత్త దొంతి నర్సింహా రెడ్డి, మన్నె నర్సింహా రెడ్డి, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న ఇతర నేతలు హాజరయ్యారు. కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చించారు.
గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావొద్దని ప్రభుత్వం యోచిస్తోందని కోదండరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కావాలనే భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని విమర్శించారు. పార్ట్-బీలో 20 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రత్యేక డ్రైవ్ కింద 2 లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి వ్యవస్థను నాశనం చేసిందని, రికార్డులు దొరకకుండా చేసిందని ఆరోపించారు.