గణపయ్యకు ఒకేసారి 42వేల మంది మహిళల హారతి- గిన్నిస్ రికార్డు దాసోహం - Devotees Harathi

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 2:15 PM IST

thumbnail
గణపయ్యకు ఒకేసారి 42వేల మంది మహిళల హారతి- గిన్నిస్ రికార్డు దాసోహం (ANI)

Devotees Harathi To Lord Ganesh Viral Video : మహారాష్ట్రలోని పుణెలో గణేశ్‌ నవరాత్రి వేడుకలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. శ్రీమంత్ దగ్దుసేత్ హల్వాయి గణపతి ఆలయంలో 42 వేల మంది మహిళలు ఒకేసారి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది రికార్డు అని నిర్వాహకులు తెలిపారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఈ ఘనతను గుర్తించి ధ్రువపత్రం అందజేసినట్లు చెప్పారు.

మరోవైపు, ముంబయి లాల్‌బగీచా గణనాథుని దర్శించుకునేందుకు రెండో రోజు భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనం సాఫీగా జరిపించేందుకు కమిటీ నిర్వహకులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. అటు ప్రముఖ పారిశ్రామికవేత్త రిలియన్స్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ నివాసంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజకీయ నాయకులతో పాటు బాలీవుడ్ నటులు, నటీమణులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.