బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 5, 2024, 2:32 PM IST
Bhatti Vikramarka Interview : బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ బయటికొచ్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మూణ్నెళ్ల క్రితం వచ్చిన ప్రభుత్వం, కరవుకు ఎలా కారణమవుతుందో చెప్పాలని ఆయన నిలదీశారు. నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నీటి కష్టాలకు కారణమయ్యాయని భట్టి ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా ఆనాడు కేసీఆర్ కుట్రలు చేశారని, కాంగ్రెస్‌కు మాత్రం అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
Minister Bhatti comments on BRS : ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేరికల విషయంలో తాము ముందడుగు వేయక తప్పటం లేదని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలని, ప్రజలు అంటేనే కాంగ్రెస్ అని ప్రజా సంక్షేమాన్ని నిలబెట్టేలా తమ పార్టీ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. భవిష్యత్తుల్లోనూ సమస్యలు రాకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే ఖమ్మం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తుందని చెప్పారు. దేశానికి దశాదిశ నిర్దేశించేలా రేపు తుక్కుగూడ సభ జరగబోతుందంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి.