ETV Bharat / state

బస్సులో వన్ ​డే పాస్​ తీసుకున్న 64 ఏళ్ల వృద్ధుడు - ఏం చేశాడో తెలుసా? - TSRTC ONE DAY PASS PROBLEM

టీఎస్​ఆర్టీసీ 24 గంటల పాస్​లో తప్పులు - టికెట్ చాలా పెద్దగా ఉండటం, సమయం, తేదీ అస్పష్టంగా ఉండటాన్ని గుర్తించిన వృద్ధుడు

ERRORS IN RTC BUS PASS
TSRTC One Day Pass Problem (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 11:27 AM IST

Updated : Jan 29, 2025, 11:37 AM IST

TSRTC One Day Pass Problem : నేటి తరం యువతలో తమ కళ్ల ముందు ఏం జరిగినా మనకెందుకులే అని చాలా మంది వదిలేసి వెళ్లిపోతుంటారు. ఆ సమస్యపై పోరాటం అనేది చేయరు. కానీ ఈ వృద్ధుడు చేసిన పనికి మాత్రం అతనిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే కానీ ఓ 64 ఏళ్ల వృద్ధుడు మాత్రం అందరిలా అనుకోకుండా, ఇది అందరికీ ఉపయోగపడే అని భావించి దాని గురించి తనకు వృద్ధాప్యం అడ్డొచ్చిన పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తాను అనుకున్నది సాధించుకున్నాడు. ఇంకా ఎవరూ అలాంటి ఇబ్బందులు పడకూడదని దానిపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు.

హైదరాబాద్​లోని యూసుఫ్​గూడకు చెందిన తుమ్మల సత్య ఈనెల 26న జీడిమెట్ల బస్సు డిపోలో రూ.100 పెట్టి ఒక్కరోజు పాసును కొన్నారు. ఆ టికెట్​ చాలా పెద్దగా ఉండటం, సమయం, తేదీ అస్పష్టంగా ఉండటాన్ని వృద్ధుడు గుర్తించాడు. మరుసటి (రోజు 27న) బస్ భవన్​కు వెళ్లారు. ఆర్టీసీ సజ్జనార్​ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన లేకపోవడంతో కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులను కలిశారు. వన్​ డే పాస్ కోసం ఇచ్చే టికెట్​లో తేదీ, సమయం సరిగా లేకపోవడం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

TSRTC Bus Pass Problem
టీఎస్​ఆర్టీసీ 24 గంటల పాస్​లో తప్పులు (ETV Bharat)

అధికారుల దృష్టికి : చరవాణి నంబరు నమోదు చేయకపోవడం, అస్పష్టంగా ఉండడం, టికెట్ పొడవుగా ఉండటాన్ని చూపించారు. ఎండీ లేకపోవడంతో అక్కడున్న అధికారుల ఫోన్ నంబర్ తీసుకొని బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మహిళా కండక్టరు పాస్ చూసి తేదీ, సమయం సరిగా లేదని టికెట్ తీసుకోవాలని తెలిపింది. దీంతో ఆయన కార్యాలయంలో తీసుకున్న అధికారి చరవాణి నంబరును సంప్రదించగా మహిళా కండక్టర్ టికెట్​ను అనుమతించింది. ఇది తన ఒక్కడి సమస్య కాదని దీనిపై ఆర్టీసీ ఎండీని కలుస్తానని తుమ్మల సత్య అన్నారు.

బస్సు డిపోల ప్రైవేటీకరణ వార్తలు - క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ

Last Updated : Jan 29, 2025, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.