ETV Bharat / entertainment

బడ్జెట్ రూ.200కోట్లు- కలెక్షన్స్ రూ.191 కోట్లు! - స్టార్లు ఉన్నా హిట్ కాలేకపోయిన సినిమా! షారుక్​కు ఇది పెద్ద షాకే! - SHAHRUKH KHAN DISASTER FILM

9 ప్లస్ అతిథి పాత్రలు, స్టార్స్​ హీరోలు కూడా! - అయినా బాక్సాఫీసు వద్ద రాణించని షారుక్ ఖాన్​ మూవీ- కలెక్షన్ల పరంగా నిరాశపర్చిన సినిమా ఏదంటే?

Shahrukh Khan Disaster Film
Shah Rukh Khan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 11:17 AM IST

Shahrukh Khan Disaster Film : సినిమాలో ఎంతపెద్ద స్టార్లు ఉన్నా ఒక్కొసారి అది విజయం సాధించకపోవచ్చు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించలేకపోవచ్చు. కథ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. అలాగే భారీగా కలెక్షన్లు వస్తాయి. ఇందుకు ఏ సినీ ఇండస్ట్రీ మినహాయింపు కాదని ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే బాలీవుడ్​లో 6 ఏళ్ల క్రితం విడుదలైన ఓ చిత్రంలో అగ్రనటుడు, మరో ఇద్దరు స్టార్ కథానాయికలు ఉన్నా సినిమాను అపజయం నుంచి గట్టెక్కించలేకపోయారు. సినిమాకు పెట్టిన బడ్జెట్​ను కూడా తిరిగి సాధించలేకపోయారు. ఇంతకీ ఆ సినిమా ఏది? బాక్సాఫీసు వద్ద ఎంతమేర కలెక్షన్లు సాధించింది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'జీరో'. ఇందులో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. అభయ్ దేఓల్, మాధవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు సల్మాన్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, కరిష్మా కపూర్, జుహీ చావ్లా, అలియా భట్, దీపికా పదుకొనే, జయా బచ్చన్ వంటి నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా 2018 డిసెంబరులో థియేటర్లలో విడుదలైంది.

బడ్జెట్​ను వసూలు చేయలేక విలవిల!
భారీ అంచనాల మధ్య రిలీజైన 'జీరో' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో ఉన్న భారీ తారాగణం కూడా మూవీని గట్టెక్కించలేకపోయారు. దీంతో రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'జీరో' మూవీ కేవలం రూ.191కోట్లు వసూళ్లను మాత్రమే సాధించి నిరాశపర్చింది.

నాలుగేళ్లు బ్రేక్!
ఈ రిజల్ట్ వల్ల షారుక్ నుంచి నాలుగేళ్ల పాటు సినిమా రాలేదు. అయితే కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించారు. కానీ 2023లో జవాన్ తో షారుక్ మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా బ్లాక్​బస్టర్ అయ్యింది. ఆ తర్వాత షారుక్ వెనుదిరిగి చూసుకోలేదు. 'పఠాన్', 'డంకీ'లతో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు.

భారీగా గ్యాప్ తీసుకున్న అనుష్క
ఇదిలా ఉండగా, 'జీరో' తర్వాత అనుష్క శర్మ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కత్రినా చివరిగా 'మెర్రీ క్రిస్మస్‌'లో కనిపించారు.

అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్​పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్​లో మోస్ట్ పాపులర్ యాక్టర్​గా!

20 ఏళ్ల క్రితమే స్టార్ హీరో అరుదైన ఘనత - ఒక్క ప్రాజెక్ట్​కు రూ. 700 కోట్ల రెమ్యూనరేషన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.