ETV Bharat / health

నాజుకైన నడుము కావాలా? రోజూ ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగి పోతుందట! - BELLY FAT REDUCTION TIPS IN TELUGU

-బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు ఈ టిప్స్ పాటించాలట! -ఎలాంటి ఆహారం తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది?

Belly Fat Reduction Tips in Telugu
Belly Fat Reduction Tips in Telugu (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 29, 2025, 10:57 AM IST

Belly Fat Reduction Tips in Telugu: మనలో చాలా మంది అందంగా, సన్నగా కనపడడాలని చూస్తుంటారు. ముఖ్యంగా నాజూకైన నడుమును సొంతం చేసుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం ఇలా ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అయితే, వీటితో పాటు ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం ఇలా!
ముఖ్యంగా రాత్రుళ్లు పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుందని అంటున్నారు. అలాగే శరీరంలో, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా కూడా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

Belly Fat Reduction Tips in Telugu
బెల్లీ ఫ్యాట్ (Getty Images)

ఎలాంటి ఆహారం?
నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే రోజు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు పక్కన పెట్టేయాలని.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు మొదలైనవి తినడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇంకా మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు మన శరీరానికి ఎంతో అవసరమని చెబుతున్నారు. అందుకే ఇవి ఎక్కువగా లభించే గింజలు, అవకాడో వంటివి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ప్రొటీన్లు ఎక్కువగా లభించే బీన్స్‌, నట్స్‌ని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంటుందంటున్నారు. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోని.. బరువునూ నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.

Belly Fat Reduction Tips in Telugu
బెల్లీ ఫ్యాట్ (Getty Images)

ఈ వ్యాయామాలు!
బరువు తగ్గడమే కాకుండా.. నడుము నాజూగ్గా మారేలా చేయడంలో వ్యాయామాలదీ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారానికి ఐదు రోజులు రోజూ కనీసం అరగంట పాటు కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలని సలహా ఇస్తున్నారు. ఈ వ్యాయామాలు మనల్ని చురుగ్గా మార్చడంలోనూ సహకరిస్తాయని అంటున్నారు. ఇంకా డ్యాన్స్ చేయడం, ఈత కొట్టడం, సైక్లింగ్ వంటివి కూడా నడుము ఆకృతిని మార్చడంలో సహకరిస్తాయని వెల్లడిస్తున్నారు. 2019లో International Journal of Obesityలో ప్రచురితమైన "The Effects of Aerobic Exercise on Visceral Fat in Overweight and Obese Adults: A Systematic Review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇంకా హార్వర్డ్ మెడికల్ పబ్లిషింగ్ అధ్యయనంలో బయటపడింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జస్ట్ 10 నిమిషాలు ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట! స్పాట్ జాగింగ్ గురించి మీకు తెలుసా?

దేశంలో అరుదైన వ్యాధి విజృంభణ- వారంలోనే 100 మందికి వ్యాప్తి! లక్షణాలు, కారణాలు ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.