ETV Bharat / bharat

'అన్నీ సగం సగం ఏర్పాట్లే!'- కేంద్రం, యోగి సర్కార్​పై విపక్షాలు ఫుల్ ఫైర్​ - KUMBH MELA STAMPEDE

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట- కేంద్రం, యూపీ సర్కార్ పై కాంగ్రెస్ విమర్శలు

Kumbh Mela Stampede
Kumbh Mela Stampede (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 11:20 AM IST

Opposition On Kumbh Mela Stampede : మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్రం, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. సగం సగం పనుల వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళా నిర్వహణను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే సమర్థవంతమైన వ్యక్తికి అప్పగించాలని విమర్శించింది. కుంభమేళాకు వీవీఐపీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేసింది.

'రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఏర్పాట్లు అంతంత మాత్రమే'
"మహా కుంభమేళాలోని త్రివేణి సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో భక్తుల మరణాలు, గాయపడిన వార్తలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. వీఐపీల రాక, సెల్ఫ్ ప్రమోషన్ వంటివి ఆపాలి. చాలా ముఖ్యమైన షాహీ స్నానాలు ఇంకా మిగిలి ఉన్నాయి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. వసతి, ఆహారం, ప్రథమ చికిత్స మొదలైన వాటిని భక్తులకు కల్పించాలి. వీఐపీల కదలికలను నియంత్రించాలి. మన సాధువులు, ఋషులు కూడా ఇదే కోరుకుంటున్నారు. బాధితులకు కాంగ్రెస్ కార్యకర్తలు సాయం చేయాలి. కుంభమేళా కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి" అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

'నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట'
ప్రయాగ్‌ రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా అనేక మంది భక్తులు మరణించడం, గాయపడడం బాధాకరమని లోక్ సభలో విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. "మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. నిర్వహణ లోపం, సాధారణ భక్తుల కంటే వీఐపీల రాకపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టడమే ఈ విషాద సంఘటనకు కారణం. బాధిత కుటుంబాలకు సాయం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థిస్తున్నాను" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

సగం సగం ఏర్పాట్లు చేశారు : పవన్ ఖేడా
ప్రయాగ్‌ రాజ్‌ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా బాధాకరమని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా తెలిపారు. కుంభమేళాకు సగం సగం ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. ఇంకా చాలా మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమానికి వస్తారని, కాబట్టి అదనపు భద్రతా దళాలను అక్కడికి మోహరించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు.

మోదీ ఆరా
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. గంటలో నాలుగు సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యలకు పిలుపునిచ్చారు. "కుంభమేళాలో పరిస్థితిని ప్రధాని మోదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యూపీ సర్కార్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు యూపీ సీఎం యోగితో మాట్లాడారు. " అని అధికారిక వర్గాలు తెలిపాయి.

అఖిలేశ్ స్పందన ఇదే!
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. "మహా కుంభమేళాలో జరిగిన దుర్ఘటనలో భక్తులు మరణించారనే వార్త చాలా బాధాకరం. క్షతగాత్రులను ఆదుకోవడానికి, గందరగోళాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి ఎయిర్ అంబులెన్స్‌ లను మోహరించాలి. శాంతి భద్రతలను కాపాడుకోవడానికి మెరుగైన నిఘా అవసరం. ఈ క్లిష్ట సమయంలో భక్తులు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి" అని అఖిలేశ్ ఎక్స్ పోస్టు చేశారు.

ఆ ఘటన చాలా విచారకరం : మాయావతి
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడం విచారకరమని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. బీఎస్పీ కార్యకర్తలు భాధితులకు అండగా ఉండాలని ఆమె కోరారు. ఈ మేరకు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ఆప్ జాతీయ ప్రతినిధి అనురాగ్ ధండా స్పందించారు. "ఇది చాలా విచారకరమైన వార్త. కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు తరలివచ్చారు. యూపీ సీఎం యోగి అక్కడ ఉండకుండా దిల్లీకి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. వీఐపీల భద్రత కోసం అన్ని ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో సామాన్య ప్రజలు మిగిలిపోయారు" అని అనురాగ్ ధండా విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.