200కార్లు, 250 బైక్‌లు దగ్ధం- ప్రమాదానికి అదే కారణమా? - fire incident in delhi today
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 1:39 PM IST
Delhi Fire Accident Today : దిల్లీ వజీరాబాద్‌లోని పోలీసు శిక్షణా పాఠశాలలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 450 వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి ట్రైనింగ్ స్కూల్‌లో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశాయి. అయితే అప్పటికే గ్రౌండ్‌లో ఉన్న పోలీసులు సీజ్ చేసిన 200 కార్లు, 250 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. వలుజ్‌లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన జరిగింది. నైట్ షిఫ్ట్ చేస్తున్న 10-15 మంది ఉద్యోగులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను గమనించిన కొందరు కార్మికులు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెట్టు సహాయంతో బయటకొచ్చేశారు. మంటలు భారీగా ఎగిసిపడడం వల్ల మరికొందరు బయటకురాలేక సజీవదహనమయ్యారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.