'ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ - ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి'
🎬 Watch Now: Feature Video
Published : Feb 12, 2024, 10:32 PM IST
Cyberabad Cyber Crime DCP Interview : సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోజుకో కొత్త పంథాతో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఇటీవల ప్రముఖు పేర్లు, ఫొటోలు పెట్టి సామాన్యులకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కుమార్తె సితార పేరుపై కూడా ఖాతాలు సృష్టించి ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లింకులు పంపారు. దీనిపై జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సామాజిక మధ్యమం(Social Media)లో ప్రకటన సైతం జారీ చేసింది.
DCP Shilpavalli Interview : ప్రముఖుల తమకు సందేశాలు పంపారని తనఖీ చేసుకోకుండా లింకులు క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారినపడే అవకాశం ఉందని సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి తెలిపారు. తెలియని వ్యక్తి నుంచి, నంబర్ నుంచి వచ్చే సందేశాలు, కాల్స్, వాట్సాప్ కాల్స్ ఇతర లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీసీపీ శిల్పవల్లితో ముఖాముఖి.