జలాశయంలో వలకు చిక్కిన భారీ మొసలి - చాకచక్యంగా బంధించిన మత్స్యకారులు - Crocodile Found in Reservoir - CROCODILE FOUND IN RESERVOIR
🎬 Watch Now: Feature Video
Published : Jun 5, 2024, 1:21 PM IST
Crocodile Found in Sarala Sagar Reservoir of Wanaparthy District : జలాశయంలో భారీ మొసలి కలకలం సృష్టించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని ఉన్న సరళసాగర్ జలాశయంలో స్థానిక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు చేపల కోసం వల విసరగా అందులోకి వంద కిలోల బరువు ఏడు అడుగుల పొడవు ఉన్న మొసలి వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా మత్స్యకారులు కంగుతిన్నారు.
మొసలిని అలాగే వలతో బయటకు తీసుకువచ్చి చాకచక్యంగా బంధించారు. వెంటనే ఒడ్డుకు చేర్చిన తర్వాత జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూరాల జలాశయానికి తీసుకెళ్లి విడిచిపెట్టేశారు. జలాశయాలు, కాలువలు, నీటి కుంటలు ఉన్నప్పుడు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇలా మొసలి కనిపించే సంఘటనలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.