సమాజంలో పాలకులు ఎలా ఉండాలో తెలిసేటట్లు చేసిన వ్యక్తి రామోజీరావు : కూనంనేని - Kunamneni Sambasiva Rao Condolences To Ramoji Rao - KUNAMNENI SAMBASIVA RAO CONDOLENCES TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 10:26 PM IST
|Updated : Jun 8, 2024, 10:44 PM IST
Kunamneni Sambasiva Rao Condolences To Ramoji Rao : రామోజీరావు ప్రజల పక్షాన ఉండి ఎంతో మేలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రామోజీరావు అంటే వ్యక్తి కాదు, ఓ శక్తి అని తెలిపారు. అటువంటి అక్షరయోధుడి మృతితో తెలుగు ప్రజానీకానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు సంక్షోభంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ, ఆయన తన సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో అగ్రగామిగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
తన రచనలతో సమాజంలో పాలకులు అంటే ఏ విధంగా ఉండాలో తెలిసేటట్లు చేసిన వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. పాత్రికేయ రంగంలోనే కాకుండా, తాను నిర్మించిన ప్రతీ రంగంలోనూ ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. వివిధ రంగాల్లో తానొక మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్తానని తెలిపిన సాంబశివరావు, రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.