తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలి : నారాయణ - CPI Narayana latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 7:30 PM IST

CPI Narayana Comments On Bihar CM Nitish Kumar : బిహార్​లో ఇండియా కూటమికి వ్యతిరేఖంగా నీతీశ్​ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ ఇండియా కూటమి ఎమ్మెల్యేలను డబ్బులు, ఈడీ, సీబీఐ కేసులంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తుందని మండి పడ్డారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ఎల్​కే అద్వానీని మోదీ ఆహ్వానించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇండియా కూటమికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ, ఆ కూటమిలోని పార్టీలను మోదీ ప్రభుత్వం భయపెడుతోందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ను కోరారు. రాష్ట్రం నుంచి కమ్యూనిష్టు నాయకులు పార్లమెంట్​లో ఉండాలని తెలిపారు. 

CPI Narayana Fires On BJP : గడిచిన పదేళ్లలో బీజేపీ జనగణన చేపట్టలేదని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని గుర్తు చేశారు. మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లను రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్​లో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని నారాయణ తెలిపారు. ఈ సమావేశాల అనంతరం దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.