వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం - దేహశుద్ధి చేసిన స్థానికులు - police Rape Attempt on Woman - POLICE RAPE ATTEMPT ON WOMAN
🎬 Watch Now: Feature Video
Published : Apr 25, 2024, 4:11 PM IST
Constable Rape Attempt on a Woman in Adilabad : వివాహితపై అత్యాచారయత్నం చేసిన కానిస్టేబుల్ని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని ధోబి కాలనీకి చెందిన ఓ కానిస్టేబుల్ ఎదురింట్లో ఎవరూ లేరని గమనించి వెళ్లి వివాహితపై అత్యాచారయత్నం చేశాడు. దాన్ని గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బాధితురాలు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను తరచూ తనను వేధించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యాపల్ గూడ రెండో బెటాలియన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ గణేష్ పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాపాడాల్సి వారే ఇలాంటి ఘటనలకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఇలా చేస్తే సామాన్యులపై ఇలాంటి ఘటనలకు పాల్పడినవారిపై ఎవరు చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు ప్రశ్నించారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరారు.