సార్ ఎగ్జామ్​కు లేటవుతోంది కాస్త లిఫ్ట్ ఇస్తారా - సివిల్స్ అభ్యర్థికి కానిస్టేబుల్ సాయం - upsc prelims exam 2024 - UPSC PRELIMS EXAM 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 2:05 PM IST

Constable Helped UPSC Aspirant To Reach Exam Hall : యూపీఎస్సీ పరీక్షకు ఆలస్యం అవుతోందని ఓ అభ్యర్థినికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాయం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ ద్విచక్ర వాహనంపై ఆ యువతిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. సమయానికి ఆమెను కేంద్రానికి తీసుకెళ్లడంతో కానిస్టేబుల్​ సురేశ్​ను ఉన్నతాధికారులు అభినందించారు.  

కాగా ఇవాళ దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్‌-2 ఎగ్జామ్ కొనసాగింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అన్ని గేట్లు మూసివేస్తారని అభ్యర్థులు సమయానికి కేంద్రానికి చేరుకోవాలని ముందే సూచించారు. మొత్తం 1,056 ఉద్యోగాలాకు ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్​లోని పలు కేంద్రాల్లో  అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా రావడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో ఏమీ చేయలేక గేటు బయటే కొందరు ఆగిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.