సీఎం రేవంత్‌ను ఎవరైనా ఏమైనా అంటే నాలుక కోస్తాం : జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ - Jaggareddy Fires On BRS - JAGGAREDDY FIRES ON BRS
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2024, 4:41 PM IST
Congress Jagga Reddy Fires On BRS : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే నాలుక కోస్తామని తీవ్రంగా హెచ్చరించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు.
రాజకీయంగా ప్రత్యర్థిని కత్తితో పొడవటానికి వస్తే ఎవరూ ఊరుకోరని తిరిగి ఎదురు దాడి చేస్తారని అదే రాజనీతి అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్‌ను పొడవడానికి వస్తే చూస్తూ ఊరుకుని ఉండాలా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికే ఉంటుందని పేర్కొన్నారు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే నాలుక కోస్తామని తీవ్రంగా హెచ్చరించారు. హరీశ్‌రావుకు మతిభ్రమించిందని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయేసరికి నిద్రపట్టడంలేదన్నారు. కల్లు తాగిన కోతి మాదిరిగా బీఆర్ఎస్ నాయకుల పద్ధతి ఉందని విమర్శించారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని తెలిపారు. సీఎల్పీల విలీనం కూడా కేసీఆర్‌నే తెచ్చారన్నారు.