LIVE : గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం - Congress Leaders Press Meet - CONGRESS LEADERS PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2024, 12:26 PM IST
|Updated : Sep 14, 2024, 1:01 PM IST
Congress Leaders Media Conference from Gandhi Bhavan LIVE : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని మంత్రి పొన్నం హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులను తాను ఎక్కడా ప్రోత్సహించలేదన్న ఆయన, బీఆర్‌ఎస్ గతంలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ప్రజాప్రతినిధులను చేర్చుకుందని అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతాం అని బీఆర్‌ఎస్, బీజేపీ అంటున్నాయని రివర్స్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో సీఎల్పీగా దళితుడు ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ చేర్చుకుందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలగొడతాం అని బీఆర్‌ఎస్, బీజేపీ అంటున్నాయన్న మంత్రి, రెండు పరస్పరం చీకటి ఒప్పందాలు జరుపుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామికంగా పాలన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా మాట్లాడే నేతలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఈమేరకు గాంధీభవన్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతున్నారు.
Last Updated : Sep 14, 2024, 1:01 PM IST