LIVE : హైదరాబాద్ బాలాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో - CM Revanth Reddy Live - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 30, 2024, 8:03 PM IST
|Updated : Apr 30, 2024, 8:40 PM IST
CM Revanth Election Campaign LIVE : రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో, ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలతోపాటు పలు చోట్ల రోడ్ల షో, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రెండు కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Apr 30, 2024, 8:40 PM IST