LIVE : శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - Revanth Corner Meeting in Siddipet
🎬 Watch Now: Feature Video
Published : May 2, 2024, 6:33 PM IST
|Updated : May 2, 2024, 9:44 PM IST
CM Revanth Reddy Corner Meeting in Siddipet : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ, అదే ఊపును పార్లమెంటు ఎన్నికలో కొనసాగించాలని చూస్తోంది. ఈసారి రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం పక్కా వ్యూహాలతో ఎన్నికల సమరానికి బయలుదేరాయి. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని చూస్తున్నారు. అలాగే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పదేళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనల వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ, ఎండగడుతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పదేళ్లలో పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
Last Updated : May 2, 2024, 9:44 PM IST