'డిజిటల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన ఘనుడు రామోజీ' - CHIRANJEEVI ABOUT ETV - CHIRANJEEVI ABOUT ETV

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 7:33 PM IST

Chiranjeevi About Ramoji Rao ETV: టెలివిజన్‌ రంగంలో రామోజీరావు సరికొత్త ఒరవడి సృష్టించారని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. గతంలో ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. 90ల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఛానెల్ మాత్రమే ఉన్న సమయంలో, రామోజీరావు ఈటీవీ ప్రారంభించి డిజిటల్ మీడియాలో కొత్త ఓరవడి సృష్టించారని అన్నారు. 'పంచతంత్ర', 'మాల్లుడి డేస్', 'అంతరంగాలు' సీరియల్, రైతులకు సంబంధించి 'పాడిపంటలు' ప్రోగ్రామ్స్​ ప్రసారాలతో ఈటీవీ ఆకర్షణీయంగా, అత్యద్భుతంగా ఉండేదని గుర్తుచేశారు. ఇక సినిమాకు ఏ మాత్రం తక్కువ కానటువంటి క్వాలిటీతో ఈటీవీలో ప్రసారమయ్యే 'మహా భాగవతం' అంటే ఆయనకెంతో ఇష్టమైన సిరీయల్ అని చిరంజీవి అన్నారు. ఇక గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్​' అంటే కూడా తనకు బాగా నచ్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇంకెన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మరి అవెంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.