రైలు చక్రాల మధ్య కూర్చుని 5ఏళ్ల చిన్నారి 100కి.మీ ప్రయాణం- ఒక్కసారిగా అంతా షాక్! - RPF Saved Child From Train
🎬 Watch Now: Feature Video
Published : Apr 22, 2024, 10:49 PM IST
Child Travelled Sitting Between Train Wheels : ఉత్తర్ప్రదేశ్లో గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చుని 100 కిలోమీటర్లకుపైగా ప్రయాణించిన చిన్నారి(5)ని ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. చిన్నారి తండ్రిని కూడా సంప్రదించారు. అదే సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు రైల్వే అధికారులు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే?
చార్బాగ్ రైల్వే స్టేషన్ నుంచి గూడ్స్ రైలు బయలుదేరింది. అంతకుముందు తండ్రితో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ రైలు వద్దకు చేరుకున్నాడు. అనంతరం రైలు చక్రాల మధ్యకు వెళ్లి నిద్రపోయాడు. రైలు ఒక్కసారిగా మొదలవ్వడం వల్ల బయటకు రాలేకపోయాడు. ఆ తర్వాత చక్రాలపైనే కూర్చుని 100 కిలోమీటర్లపైగా దూరం ప్రయాణించాడు.
హర్దోయ్ రైల్వే స్టేషన్కు గూడ్స్ రైలు చేరుకున్నాక తనిఖీల్లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది చక్రాల మధ్య ఉన్న పిల్లవాడిని గుర్తించి బయటకు తీశారు. అనంతరం చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. పిల్లవాడి తండ్రిని సంప్రదించారు. అయితే ముందుగా భయపడ్డ చిన్నారి, తర్వాత జరిగినదంతా అధికారులకు చెప్పాడు.