LIVE : వరదలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం - Kishan Reddy On Floods - KISHAN REDDY ON FLOODS
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2024, 4:15 PM IST
|Updated : Sep 3, 2024, 4:36 PM IST
Central Minister Kishan Reddy On Floods Live : వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు కొనసాగించేలా, వారికి అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశించారు. వరద బాధితులను ఆదుకునేలా, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న కార్యకర్తలను అభినందించారు. వారి సేవలు కొనసాగించాలని సూచించారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పలువురు మృత్యువాత పడడం, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడం, పెద్దఎత్తున రైతుల పంటపొలాలు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పాటు పూర్వ రంగారెడ్డి, హైదారాబాద్ జిల్లా కమిటీలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వరదలతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 17వేడుకలు, జనసమీకరణ, సభ్యత్వ నమోదు అంశాలపైన చర్చించారు. ఈ క్లిష్ట సమయంలో బీజేపీ కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Last Updated : Sep 3, 2024, 4:36 PM IST