LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - KTR PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : 9 hours ago
|Updated : 9 hours ago
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇవాళ ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు విచారణ సాగింది. అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. అధికారులకు అన్ని విధాలా సహకరించానని, విచారణకు ఎన్ని సార్లు పిలిచినా, హాజరవుతానని తెలిపారు. ఇదొక చెత్త కేసు అని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే తనపై ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని, తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఓ 4 ప్రశ్నలను అటుతిప్పి, ఇటు తిప్పి 40 రకాలుగా అడిగారని అందులో కొత్త ప్రశ్నే లేదన్నారు. కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం.
Last Updated : 9 hours ago