ఫ్లైఓవర్‌పై బస్సు బీభత్సం- అనేక కార్లు, బైకులు ధ్వంసం!- లోపల ఉన్నవారంతా!! - Bengaluru bus crash Video - BENGALURU BUS CRASH VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 4:33 PM IST
Bus Accident In Bengaluru : బెంగళూరులో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బల్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ముందున్న బైక్‌లు, కార్‌లను బస్సు వరుసగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వాహనదారుడి కాలికి తీవ్రంగా గాయమైంది. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 4 కార్లు, 2 బైక్‌లు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
డ్రైవర్ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని ఆ దృశ్యాలను బట్టి తెలిసింది. ఒకే చేతితో బస్సు స్టీరింగ్‌ను డ్రైవర్ తిప్పడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రమాద సమయంలో బస్సు ప్రయాణికులు సైతం భయాందోళనలకు గురవడం మరో సీసీటీవీలో రికార్డయింది. కొన్ని మీటర్ల దూరం బస్సు అలాగే వెళ్లగా, ముందు ఉన్న ఓ కారు అడ్డం తిరగడం వల్ల బస్సు ఆగిపోయింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ వైపు ఈ బస్సు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బ్రేకుల్లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ ఘటనపై హెబ్బల్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.